Na Snehithuda

Na Snehithuda - Nissy John & Prabhu Pammi Lyrics


Na Snehithuda
Singer Nissy John & Prabhu Pammi
Composer Prabhu Pammi
Music Prabhu Pammi
Song WriterPammi Daniel, Divya David & Prabhu Pammi

Lyrics

నీ ముఖం మనోహరం
నీ స్వరం మధురము
నా ప్రియుడా యేసయ్య

దేవా.. దేవా…దేవా…దేవా..

1.యేసయ్య, నా స్నేహితుడా
నా ఆరాధన దైవమా
స్తుతి అర్పింతును
నా జీవితాంతం
దేవా కొలిచెదను
హృది అర్పింతును
నీ నీతి శాశ్వతా-మైనది
శాశ్వతా మైనది

2.లోకము మారినా మారని ప్రేమ
కాలము గడిచినా వీడని ప్రేమ
అన్నిటి మించిన అరుదైన ప్రేమ
కన్నీరు తుడిచే కలువరి ప్రేమ
ఏం ఇవ్వగలను నీ ప్రేమకు
నిన్ను వర్ణించగలనా నా యేసయ్య

దేవా… దేవా…దేవా…దేవా…


Na Snehithuda Watch Video

Yevaru choopinchaleni

Yevaru choopinchaleni - Mohammad Irfan Lyrics


Yevaru choopinchaleni
Singer Mohammad Irfan
Composer Pranam Kamlakhar
Music Pranam Kamlakhar
Song WriterJoshua Shaik

Lyrics

ఎవరు చూపించలేనీ - ఇలలో నను వీడిపోనీ
ఎంతటీ ప్రేమ నీదీ - ఇంతగా కోరుకుందీ
మరువనూ యేసయ్య

నీ కథే నన్నే తాకగా - నా మదే నిన్నే చేరగా
నా గురే నీవై యుండగా - నీ దరే నే చేరానుగా

1. తీరాలే దూరమాయే - కాలాలే మారిపోయే
ఎదురైన ఎండమావే - కన్నీటి కానుకాయే
నా గుండె లోతులోన - నే నలిగిపోతువున్నా
ఏ దారి కానరాక - నీకొరకు వేచివున్నా
ఎడబాటులేని గమనాన
నిను చేరుకున్న సమయాన
నను ఆదరించే ఘన ప్రేమ
అపురూపమైన తొలిప్రేమ
ఏకమై తోడుగా - ఊపిరే నీవుగా
ఎవ్వరూ లేరుగా - యేసయ్య నీవెగా

2. ఈ లోక జీవితాన - వేసారిపోతువున్నా
విలువైన నీదు వాక్యం - వెలిగించె నా ప్రాణం
నీ సన్నిథానమందు - సీయోను మార్గమందు
నీ దివ్య సేవలోనే - నడిపించే నా ప్రభూ
నీ తోటి సాగు పయనాన
నను వీడలేదు క్షణమైన
నీ స్వరము చాలు ఉదయాన
నిను వెంబడించు తరుణాన
శాశ్వత ప్రేమతో - సత్యవాక్యంబుతో
నిత్యము తోడుగా నిలిచె నా యేసయ్య


Yevaru choopinchaleni Watch Video

Sudhooramu ee payanamu

Sudhooramu ee payanamu - Surya Prakash Injarapu Lyrics


Sudhooramu ee payanamu
Singer Surya Prakash Injarapu
Composer Hadlee Xavier
Music Hadlee Xavier
Song WriterJoel Kodali

Lyrics

సుదూరము ఈ పయనము ముందు ఇరుకు మార్గము
యేసు నాకు తోడుగా నాతోనే నడుచుచుండగా
నే వెంట వెల్లెదా నా రాజు వెంబడి
సుమధుర భాగ్యము యేసుతో పయనము
1.
అలలపై నే నడిచెదా తుఫానులో హుషారుగా
ఆ ఎత్తులు ఆ లోతులు ఆ మలుపులు నే తిరిగెదా
ఉల్లాసమే యేసుతో నా పయనమంతయు
ఆశ్చర్యమైనది నే నడుచు మార్గము
ఒకొక్క అడుగులో ఓ క్రొత్త అనుభవం
2.
హోరు గాలి వీచినా అలలు పైకి లేచినా
ఏ భయము నాకు కలగదు నా పాదము తొట్రిల్లదు
నా చెంతనే ఉన్న యేసు నన్ను మోయును
ఇది నా భాగ్యము నాలోని ధైర్యము
ఏ దిగులు లేకనే నే సాగిపోదును
3.
నా జీవితం పదిలము యేసుని చేతిలో
నా పయనము సఫలము యేసుదే భారము
నే చేరేదా నిశ్చయంబుగా నా గమ్యము
ఇది నా విశ్వాసము నాకున్న అభయము
కృపగల దేవుడు విడువడు ఎన్నడూ


Sudhooramu ee payanamu Watch Video

Na Snehithuda

Na Snehithuda - Nissy John & Prabhu Pammi Lyrics Singer Nissy John & Prabhu Pammi Composer Prabhu Pammi Music ...